వెంకటాపురంలో పరస్పర దాడులు

ములుగు ముచ్చట్లు:


ములుగు జిల్లా  వెంకటాపురం మండలంలోని బెస్తగూడెం గ్రామ శివారులో గిరిజనులకు ,గిరిజనేతరులకు మధ్య వాగ్వివాదం జరిగింది. తరువాత  పరస్పరం ఒకరి పై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఘటనలో  ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అబ్బులు అనే వ్యక్తి తలకు బలమైన గాయం కావడంతో వెంకటాపురం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలించినట్లు సమాచారం.  బెస్తగూడెం గ్రామ శివారులోని గణపతి ఆలయానికి ఇచ్చిన భూములని దున్నడానికి గిరిజనులు వెళ్లారు.    విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఎందుకు దున్నుతున్నారు అని ప్రశ్నించగా వారిపై గిరిజనులు దాడికి దిగారు.     ఆలయం కోసం ఇచ్చిన భూములను దున్నవద్దని పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తిరిగి దాడి చేసారు. ఇరువర్గాలు  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి.

 

Tags; Mutual attacks in Venkatapuram

Leave A Reply

Your email address will not be published.