నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది-మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ ముచ్చట్లు:
20మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్న కామెంట్స్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. 15-20 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతుందని మాత్రమే అన్నాను.
100స్థానాల్లో గెలుస్తున్నాం, 20స్థానాల్లో కొంచెం సర్థుకోవాలని చెప్పానని అన్నారు.
80 స్థానాల్లో విజయం తథ్యమన్నాను…కానీ మీడియా నావ్యాఖ్యలను వక్రీకరించింది. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి లక్ష మంది ఖమ్మం సభకు వెళ్తున్నాం. బీఆర్ఎస్ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. రైతుల ఎన్ని పనులున్నా వదులుకుని సభకు వస్తున్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోలుకుంటున్నారని అయన అన్నారు.
Tags; My comments were distorted by the media-Minister Errabelli

