ఆ భేటీ పై కోడాలి నాని స్పందన

విజయవాడ ముచ్చట్లు:


జూనియర్ ఎన్టీఆర్,కేంధ్ర మంత్రి అతిషా భేటి పై వైస్సార్సీపీ మాజీ మంత్రి , ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ప్రధాని మోడీ, అమిత్ షా ఉపయోగం లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని నాని అన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్తో, అమిత్ షా సమావేశం అయ్యారని భావిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపరచుకోవడానికే కేంద్రమంత్రి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్తో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉందని అన్నారు. చంద్రబాబు తో ప్రయోజనం లేకే ఢిల్లీ వచ్చినా మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కొడాలి నాని పేర్కొన్నారు.బీజేపీని విస్తరించేందుకే అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ను కలిశారని భావిస్తున్నట్లు చెప్పారు.

 

Tags: My daughter-in-law’s response to that meeting

Leave A Reply

Your email address will not be published.