నా కూతురుని హత్యాచారం చేసిన వారి సంగతేంటీ

My daughter murdered my daughter

My daughter murdered my daughter

12 ఏళ్ల  నుంచి న్యాయం కోసం ఎదురుచూపులు

Date:06/12/2019

విజయవాడ ముచ్చట్లు:

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచార కేసు నిందితులు ఈ రోజు ఉదయం ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. గత నెల 27న దిశపై అత్యాచారం.. హత్య ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించేందుకు సైబరాబాద్ పోలీసులు నిందితులను కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో హత్యాచార ఘటన రీకన్‌స్ట్రక్షన్‌ చేసేందుకు నిందితులను సంఘటన స్థలం వద్దకు తీసుకెళ్లారు.దిశపై పెట్రోల్ పోసం నిప్పంటించిన చటాన్‌పల్లి అండర్‌పాస్ బ్రిడ్జి వద్దకు వెళ్లిన తరువాత నిందితులు తప్పించుకుని పారిపోయేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. పోలీసులపై రాళ్లతో దాడి చేయడంతోపాటు తుపాకీ లాక్కొని బెదిరించడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్లు చెబుతున్నారు. అయితే దిశ హత్యాచార ఘటన నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమవడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీసులు, ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌కు పెద్దఎత్తున అభినందనలు చెబుతున్నారు.

 

 

 

 

 

 

 

 

ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్న వేళ ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశపై హత్యాచారానికి పాల్పడిన నిందితులందరూ సామాన్యులని.. అందుకే ఎన్‌కౌంటర్ చేయగలిగారని అన్నారు. ఎలాంటి రాజకీయ అండదండలు లేకపోవడంతో నిందితులను ఈజీగా కాల్చి చంపేశారన్నారు. దిశ తల్లిదండ్రులకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు శంషాద్ బేగం.కానీ.. పన్నెండేళ్ల క్రితం అత్యాచారం, హత్యకు గురైన తన కుమార్తెకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. ఆయేషా హత్య కేసులో రాజకీయ నేతల ప్రమేయం వల్లే న్యాయం జరగలేదని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

 

 

 

 

 

 

హత్యకు గురైన తన కుమార్తె విషయంలో నేటికీ న్యాయం జరగలేదని ఆవేదన చెందారు శంషాద్ బేగం. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా ప్రత్యేక చట్టాలు తేవాలని ఆమె ఆకాంక్షించారు. సీపీ సీపీ సజ్జనార్ లాంటి పోలీసు అధికారి తమ కుమార్తె కేసు దర్యాప్తు చేసి ఉంటే తమకు న్యాయం జరిగి ఉండేదేమోనని ఆమె అన్నారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాను తన హాస్టల్‌లోనే అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన 2007లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఉమెన్ హాస్టల్‌లో జరిగింది. అప్పట్లో ఆయేషా మీరా హత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ కేసులో అసలైన నిందితులను రాజకీయ నాయకుల ప్రమేయంతో తప్పించారని.. తమకు న్యాయం చేయాలని ఆయేషా తల్లి శంషాద్ బేగం కోరుతున్నారు.

 

వెంకటగిరిలో ఆనం సంచలన వ్యాఖ్యాలు

 

Tags:My daughter murdered my daughter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *