నాలా పూడికతీత  పనులు  వేగవంతంగా పూర్తి చేయాలి

–  మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి

హైదరాబాద్  ముచ్చట్లు:

వర్షా కాలంలో లోతట్టు ప్రాంతలలో  నివసిత ప్రజలకు వరద ప్రమాదం లేకుండా నాళాల పూడికతీత పనులు  వేగవంతంగా పూర్తి చేయాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి  అధికారులను ఆదేశించారు పట్టణ ప్రగతి కార్యక్రమం లో బాగంగా బంజారాహిల్స్ ప్రేమ్ నగర్ కాలనీ లో మేయర్  పర్యటించి కాలనీ ల సమస్యలను    తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు . ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో  వరద నివారణకు నాళాల పునరుద్దరణ, రిటైన్నింగ్ వాల్ నిర్మాణాల కోసం  జి హెచ్ ఏం సి పరిధిలో 37 పనులు వివిధ  దశలో  ఉన్నాయని వెల్లడించారు  వర్ష కాలం లో  వరద ముంపు నివారణకు  ప్రత్యేక మాన్ సూన్  బృందాలను కూడా  ఏర్పాటు చేసినట్లు అంతేకాకుండా   నాళాల వలల ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా వరద ప్రమాదాల నివారణకు  రక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జోనల్ వారీగా   వల్బారెబుల్ పాయింట్ల ను గుర్తించి  చైన్ లింక్ మేష్ లు, ప్రీకాస్టు స్లాబ్స్, హెచ్చరిక బోర్డ్ లు ఏర్పాటు చేసినట్లు మేయర్ వివరించారు.పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యులు  అయ్యి  కాలనీ సమగ్ర అభివృద్ధికి  దోహద పడలన్నారుఈ కార్యక్రమం లో యస్ ఎఫ్ ఏ, పారిశుద్ధ్య కార్మికులు డ్రెస్ కోడ్ పాటించనీ సిబ్బంది పై మేయర్ మండి పడ్డారు చిల్డ్రన్ పార్కు సందర్చి  కొత్త పరికరాలను అమర్చి బోర్డ్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో యస్ యెన్ డి పీ,  సి ఈ కిషన్  ఇతర విభాగపు అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: My excavation work should be completed expeditiously

Post Midle
Natyam ad