అమరావతికే నా మద్దతు 

Date:24/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు

ఏపీ రాజధాని విషయంలో అమరావతి రైతుల డిమాండ్‌ న్యాయమైందంటున్నారు కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే. గురువారం అమరావతి జేఏసీ మహిళా నేతలు, రైతులు కేంద్రమంత్రిని కలవగా..
వారికి మద్దతు ఇచ్చారు. అమరావతి రాజధానికి తన మద్దతు ఉంటుందని.. పేద, దళిత రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారన్న ఆయన.. అమరావతి గొప్ప చారిత్రక ప్రాంతమన్నారు.
ఈ అంశంపై ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాస్తానని చెప్పారు. మహిళా జేఏసీ సభ్యులు అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయన్ని వివరించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును వివరించి
వినతిపత్రం అందజేశారు.అమరావతి మహిళా జేఏసీ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అమరావతికి జాతీయ నేతల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. వివిధ పార్టీల ఎంపీలను కలిసి వినతిపత్రాలు
అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రుల్ని కూడా కలుస్తున్నార. రాజధాని అమరావతిలోనే కొనసాగించేలా చూడాలని కోరుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీల్ని కలిసి మద్దతు కోరారు.

 

 కరోనా పరీక్షల్లో తెలంగాణ వెనకబడింది

Tags:My support to Amravati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *