రాజయ్యకు నా మద్దతు : కడియం శ్రీహరి

My support to Rajaiah: Kadiyam Srihari

My support to Rajaiah: Kadiyam Srihari

Date:11/10/2018
వరంగల్  ముచ్చట్లు:
టీఆర్ఎస్ బలపడాలన్న, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్యను గెలిపించాలి.  రాజయ్య కూడా అందరిని కలుపుకొనిపోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.  కేసీఆర్ పట్ల ఇష్టం ఉన్నవాళ్లు, కడియం శ్రీహరి అంటే అభిమానం ఉన్న వాళ్ళు, రాజయ్యను ఇష్టపడేవాళ్ళు రాజయ్య అభ్యర్థిత్వాన్ని బలపరచాలిని అన్నారు. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సింది చూడాలి.  స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు.  మనమందరం కలిస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదని అయన అన్నారు.  రాజయ్యకు నా పూర్తి సహాకారం ఉంటది.  నన్ను అభిమానించే వారందరు పూర్తి స్థాయిలో రాజయ్యకు సహాకరించాలని అయన కోరారు.  రాజయ్య వర్గీయులు, నా వర్గీయులు, ఉద్యమకారులు అంతా కలిసి స్టేషన్ ఘన్ పూర్ లో గులాబీ జెండా ఎగురవేయాలని అయన అన్నారు.
Tags:My support to Rajaiah: Kadiyam Srihari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *