దేవినేని ఉమా ఆరోపణలపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పందన

నువ్వు నేను చూసుకుందాం అంటే దేనికైనా రెడీ అంటూ మాస్ వార్నింగ్

 

నందిగామ ముచ్చట్లు:

దేవినేని ఉమా ఆరోపణలపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పందించారు.నువ్వు నేను చూసుకుందాం అంటే దేనికైనా రెడీ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నందిగామ మండలం ఐతవరంలో మా సొంత మనిషి గణేష్ మునేరులో నీటిలో మునిగిన ప్రమాదంలో చనిపోతే నేను మా కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డాం.దీన్ని కూడా రాజకీయం కోసం వాడుకున్నాడు దేవినేని ఉమా.ఆ గోతులు ఇసుక అక్రమ రవాణా కోసం దేవినేని ఉమా హయాంలో తవ్వినవేనని ఆరోపించారు.దివంగత నేత వైఎస్సార్ హయాంలో కోటి ఇటుకల పథకం పెట్టి నిరుపేదలకు, ప్రజల బహిరంగ ప్రయోజనాల కోసం ఉచితంగా ఇటుకలు ఇచ్చాను.నేను దేవాలయాలకు, చర్చిలకు, ప్రార్ధన మందిరాలకు విరాళాలు ఇస్తా. నీకు చేతనైతే నువ్వు కూడా ఇవ్వు. అసలు నీ దరిద్రపు మొహం ఏనాడైనా ఎవరికైనా విరాళాలు ఇచ్చిందా? దేవినేని ఉమా అనే వాడు మలపత్రాష్టుడు, నికృష్టపు వెదవ. విటీపీఎస్ బూడిద విషయంలో కూడా వీడు అన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఎన్టీటీపీఎస్ బూడిద బయటకు వెళ్ళాలి. విద్యుత్ నిత్యావసరం. కేంద్ర ప్రభుత్వ విధి విధానాల మేరకు బూడిదను బ్రిక్స్, సిమెంట్ కంపెనీలకు, జాతీయ రహదారుల నిర్మాణాలకు తరలిస్తున్నారు. లోకల్ ట్రాన్స్ పోర్టర్ కోయ వెంకట్రావు నా దగ్గరకు వస్తే నేను కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని విటీపీఎస్ వారిని కోరాను.

 

 

దీన్ని కూడా నాకు అపాదించి దుష్ప్రచారం చేస్తున్నాడు దేవినేని ఉమా.  పగలు టీడీపీతో రాత్రి వైసీపీతో సంసారం చేస్తాడు దేవినేని ఉమా. డబ్బుల కోసం చీకటి ఒప్పందాలు బాగానే చేస్తాడు. దేవినేని ఉమా చేసేవన్ని లోపాయికారి ఒప్పందాలే. చేసేవన్నీ చేస్తాడు. పైకి మాత్రం ఆరోపణలు చేస్తుంటాడు. వీడంత దగుల్బాజీ మరొకడు లేడని అన్నారు.
ఎప్పుడో  దశాబ్దాల కాలంనాటి ఇంటిని పడవేసి, వయసు మీద పడుతున్న నా తలిదండ్రుల సౌకర్యార్థం కొత్త ఇంటిని కట్టుకునే క్రమంలో నేను నా తండ్రి గారు కొంతకాలం స్పిన్నింగ్ మిల్ లో గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నారు. ఎప్పుడైనా ఐతవరం సొసైటీలో పనుల కోసం వస్తే ఇల్లు పునర్నిర్మాణంలో ఉంది కాబట్టి సొసైటీలో ఒకటి, రెండు రోజులు వున్నారు. ఇదికూడా నికృష్ట దేవినేని ఉమా రాజకీయాల కోసం నేను మా నాన్నగారిని తరిమేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఉమా గాడి అంత పనికిమాలిన వాడు ఎవడైనా ఉన్నాడా.?

 

 

నా సోదరులు పత్రికా విలేకరుల సాక్షిగా మీ అందరి ముందు దేవినేని ఉమాకు ఛాలెంజ్ చేస్తున్నా. నేను నా ముగ్గురు అక్కలను తీసుకుని వస్తా. ఉమా  సోదరీమణులను కూడా తీసుకొని రమ్మనండి. మీడియా సోదరులే న్యాయ నిర్ణేతలు. మా ముగ్గురి అక్కల ఆస్తులను నేను కొట్టేసినట్లు వాడు దేవినేని ఉమా గాడు చేస్తున్న ప్రచారంలో నిజం ఎంతో బహిరంగంగానే తేల్చుకుందామని అన్నారు.దేవినేని ఉమా తమ్ముడు పిల్లల సొంత ఫంక్షన్ పంచెల బహుకరణకు కూడా వెళ్ళలేదు. కానీ ఆ ఫంక్షన్ కు నేను వెళ్ళాను. వీడు ఉమా గాడు కాలం కలిసి వచ్చి రమణ గారు చనిపోయి ఎమ్మెల్యే అయ్యాడు. కనీసం రమణ గారి కూతురు పెళ్ళి అమెరికాలో జరిగితే కనీసం ఇక్కడ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం రమణ గారి అభిమానుల కోసమైన సరే ఇక్కడ వారి బిడ్డల ఫంక్షన్ ఏ ఒక్కటి నిర్వహించలేదు. దేవినేని ఉమా తండ్రి చనిపోయిన తరువాత కూడా క్రతువు నిర్వహించిన వాళ్లకు, దినం కార్డులు పంచిన వాళ్లకు, పాలు, పెరుగు బక్కెట్లకు కూడా డబ్బులు ఇవ్వలేని కక్కుర్తి వెధవ. వీడికి సిగ్గు, శరం, చీము నెత్తురు లేదు.

 

 

నువ్వు ఒకటి మాట్లాడితే నేను వంద మాట్లాడతా. నువ్వేం మాట్లాడకపోతే నేనేం మాట్లాడను. నువ్వు రాజకీయాలు మాట్లాడితే నేను రాజకీయాలే మాట్లాడతా. నువ్వు కుటుంబ వ్యవహారాలు, ఏది బడితే అది, అబద్ధాలు మాట్లాడితే ‘అరే నా కొడకా’ నువ్వు ఏమైపోతావో కూడా నాకు తెలియదని అన్నారు.
ఇబ్రహీంపట్నం దగ్గర నువ్వు మంత్రిగా ఉన్నపుడు లాంచీ ప్రమాదం జరిగి కృష్ణానదిలో మునిగి ఎంతో మంది చనిపోతే నువ్వేం చేసావురా దేవినేని ఉమా..? దీనికి నువ్వు సమాధానం చెప్పు..? వీడు అడిగే బోడి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలంట..? కొటికలపూడికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తికి ఎన్నికల అప్పుడు డబ్బులు తీసుకుని దేవినేని ఉమా మోసం చేశాడు. కోట వీరబాబు, మాగంటి బాబు పేరుతో ఎన్నికల సమయంలో వారి ఖాతాల్లో కోట్లాది రూపాయల డబ్బులు వేసి తెల్లవారేసరికి డ్రా చేసింది నిజమా కాదా? ఆ ఒక్కరోజే డబ్బులు ఎందుకు వచ్చి, ఆ ఒక్కరోజే ఎందుకు డ్రా చేశారు. దీనికి సమాధానం చెప్పమని నిలదీసారు.

 

Tags: Mylavaram MLA Vasantha Krishnaprasad’s reaction to Devineni Uma’s allegations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *