అపోహలొద్దు… కోవిడ్‌నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకుందాం
చౌడేపల్లె ముచ్చట్లు:
కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడంలో అపోహలొద్దని, తప్పనిసరిగా అందరూ వ్యాక్సిన్ వేసుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని ప్రభుత్వ వైద్యశాల అభివృద్ది కమిటి చైర్మన్ కళ్యాణ్ భరత్ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీపీ రామమూర్తి, వైద్యాధికారి పవన్,ప్రజాప్రతినిధుల చే 15 యేళ్ల నుంచి 18 యేళ్ల లోపు గల విద్యార్థులకు తొలివిడత కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించారు. వారం రోజుల పాటు మండలంలో ప్రత్యేక డ్రెవ్ ద్వారా 14 పాఠశాలలో గల 1532 మందికి వ్యాక్సినే వేసేలా చర్యలు తీసుకొంటున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని త ల్లితండ్రులకు సూచనలిచ్చి మాస్క్‌లు వాడేలా చైతన్యం తేవాలని కోరారు. కలిసి కట్టుగా జాగ్రత్తలు పాటించి కోవిడ్ భారీనుంచి మనతో పాటు మనవెంట, చుట్టుప్రక్కల ఉన్న వారిని రక్షించుకొందామంటూ కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నరసింహులు యాదవ్, సింగిల్‌విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, ఎంపీటీసీ రూపారేఖ, సర్పంచ్ వరుణ్‌భరత్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం తదితరులున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Myth … Let’s protect health from the cove