నదిచాగి  శ్రీ సిద్ధప్ప తాత స్వామి 49వ జాత్రా మహోత్సవం…

దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు

కౌతాళం ముచ్చట్లు:

కౌతాళం  మండలంలోని నదిచాగి గ్రామంలో శనివారం అంగరంగ వైభవంగా భక్తుల చేతులమీదుగా శ్రీ సిద్ధప్ప తాత   స్వామి 49వ జాత్రా మహోత్సవం జరిగింది. ఉదయం 8 గంటలకు భక్తితో భక్తులందరూ స్వామివారి రథం ముందుకు లాగేరు. ఉదయం 6 గంటలనుంచి అర్చకులు శ్రీ సిద్ధప్ప తాత స్వామివారికి బిల్వపత్రాలతో మరియు పూలమాలలతో ఎంతో వైభవంగా అలంకరించి మహా రుద్రాభిషేకం, మహా మంగళారథులు, జల అభిషేకం పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా నదిచాగి సిద్ధప్పతాత స్వామి మఠం ధర్మకర్త పెద్దతుంబలం సిద్దయ్య స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో సెకెండ్ వేవ్ కరోన మహమ్మారి సంఖ్య పెరుగుతున్నందున తక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారని ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  భక్త మహాశయులు పాల్గొన్నారు…

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Nadichagi Sri Siddhappa Tatha Swami 49th Jatra Festival …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *