Natyam ad

నాడు ఊపిరి….నేడు ఆహారం-ఎంపీ మిధున్‌రెడ్డి చే ఆసుపత్రికి వచ్చే వారికి భోజనం

– హర్షం వ్యక్తం చేస్తున్న జనం

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు , వారి కుటుంబ సభ్యుల కష్టాలను స్వయంగా పరిశీలించిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆసుపత్రికి వచ్చే వారికి నాణ్యమైన భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు , వారి కుటుంబ సభ్యులకు సకాలంలో నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహణకు ఎంపీ నిధులతో పాటు సొంత నిధులు కూడ కేటాయిస్తామని తెలిపారు. భోజన పంపిణీ కార్యక్రమాలను పార్టీలో చురుగ్గా పని చేసే ఇద్దరికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. అలాగే ఈ కార్యక్రమం నిరంతరం జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భోజనం నాణ్యంగా తయారు చేసే వారిని ఎంపిక చేయాలని రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణంకు సూచించారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభంకానుండటంతో పట్టణ ప్రజలతో పాటు రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నాడురోగులకు ఊపీరి…

కరోనాతో అవస్థలు పడుతున్న రోగులకు ఎంపీ పెద్దిరెడి వెంకటమిధున్‌రెడ్డి తన సొంత నిధులు రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆ నిధులతో ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు. అలాగే సిలిండర్లతో పాటు ఆక్సిజన్‌ బెడ్లు, వెంటిలేటర్లు ఏర్పాటు చేసి, ప్రైవేటు ఆసుపత్రికి దీటుగా వైద్యసేవలు అందించే కార్యక్రమాన్ని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రస్తుతం రోగులకు భోజనం పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తుండటంతో సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Tags: Nadu Opiri….Today’s Food-Food for those coming to the hospital by MP Midhun Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.