Natyam ad

నాగ్ పొలిటికల్ ఎంట్రీ

విజయవాడ ముచ్చట్లు:


అక్కినేని నాగార్జునకు అలాంటి ఆలోచన లేదు.   ఆ ఉద్దేశమూ లేదు. అయినా ఆప్పుడే, అంతా అయిపోయినట్లే ప్రచారం జరుగుతోంది. కనీసం వన్ సైడ్ లవ్ అయినా లేకుండానే, ఏకంగా ట్రైయాంగిల్ లవ్ స్టొరీ అల్లేసిన విధంగా, సోషల్ మీడియా క్రియేటివ్ రైటర్స్ జగన్, అక్కినేని నాగార్జున మధ్య  పొలిటికల్ లవ్ స్టొరీ ని అల్లేశారు.అవును మనం,మాట్లాడు కుంటోంది బిగ్ బాస్ నాగార్జున పొలిటికల్ ఎంట్రీ గురించే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఆయన ప్రేమలో పడ్డారంటూ వస్తున్న కథనాల గురించే. గత కొద్ది రోజులుగా, సోషల్ మీడియాలో కొంత వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఇలాంటి వదంతులు బాగా షికారు చేస్తున్నాయి. నాగార్జున త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని, వైసేపీలో చేరుతున్నారని, అదే విధంగా విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని, వండి వార్చిన కథనాలు చాలానే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, గాలి కథలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే  వైసీపీ సోషల్ మీడియాలో ఈ ‘వంటక’ స్టొరీ బాగా వైరల్ అవుతోంది.

 

 

 

అయితే, ఇందులో అంతా కాకున్నా కొంతైనా నిజం ఉందా అంటే, అసలే లేందంటున్నారు, ఆ ఇద్దరినీ ఎరిగిన సినీ, రాజకీయ రంగ ప్రముఖులు. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి, ముఖ్యంగా ఆయనకు సినిమా రంగం గురించి, సినిమా హీరోలు, నిర్మాతల గురించి ఉన్న ‘గౌరవ’ భావం తెలిసిన ఎవరు, ఆయనతో రాజకీయ సంబంధాలు పెట్టుకునే సాహసం చేయరని  అంటున్నారు. అలాంటిది, అందాల నటుడు,  అక్కినేని నాగేశ్వరరావు వారసుడు,అన్నిటినీ మించి,నాగేశ్వరరావు నుంచి నటనతో పాటు వ్యాపార సూత్రాలనూ బాగా వంట పట్టించుకున్న నాగ్  అలాంటి తప్పు అసలే చేయరని అంటున్నారు.  నాగార్జున ప్రధానంగా నటుడే కావచ్చును,కానీ, అంతకు మించి ఆయన,ఓ మంచి బిజినెస్ మ్యాన్, అయన వేసే ప్రతి అడుగులో ‘నా కేంటి?’ అని ఒకటికి పది సార్లు బేరీజు వేసుకుని ఆ తర్వాతనే ముందడుగు వేస్తారని అంటారు. అన్నిటినీ మించి ఆయనకు రాజకీయ సొద అసలే గిట్టదని అంటారు.అలాగని ఆయనకు రాజకీయ సంబంధాలు లేవా అంటే ఉన్నాయి.. అయితే… అవన్నీ కూడా వ్యాపార సంబధాలతో ముడి పడిన రాజకీయ సంబంధాలే తప్ప,

 

 

 

Post Midle

రాజకీయ రంగులు పూసుకునే సంబంధాలు కాదని అంటారు. కారల్ మార్క్స్, ‘మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే’ అంటూ చేసిన సూత్రీకరణను కమ్యూనిస్టులు ఎంతవరకు నమ్ముతారో ఏమో కానీ, అక్కినేని నాగార్జున మాత్రం పూర్తిగా నమ్ముతారని, ఆర్థిక ప్రయోజనాలు లేకుండా ఆడుకు ముందుకు వేయరని అంటారు. అవును, ఆయన వైఎస్  ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, ఆరోగ్య‌శ్రీ ప్రకటనలో నటించారు. అలాగే జగన్ రెడ్డి పాద యాత్ర సమయంలోనూ ఆయన వైసేపీకి మద్దతు తెలిపినట్లు ప్రచారం జరిగింది కానీ, ఆయన ఎప్పుడూ బహిరంగంగా అలాంటి  ప్రకటన చేయలేదు. నాగర్జున, నాగ చైతన్య అభిమాన సంఘం అధ్యక్షుడి పేరున బి,రాము అనే వ్యక్తి చేసిన ప్రకటనను నాగార్జునకు ముడి పెట్టి వైసేపీ నాయకులు ప్రచారం చేసుకున్నారని అంటారు. నాగార్జున అప్పుడు గానీ, ఇప్పడు గానీ, ఎప్పుడూ ఒక్క వైసీపీ కనే కాదు ఏ పార్టీకి కూడా బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు. అదలా ఉంటే గతంలో రాజ్యసభ టికెట్’ కు సంబంధించి చిరంజీవితోనూ జగన్ రెడ్డి ఇలాంటి కథనే నడిపించారు.

 

 

 

లంచ్ కి పిలిచి సోషల్ మీడియాలో రాజ్యసభ టికెట్ జరిపించారు.   చివరకు మెగా స్టార్ నవ్వుల పాలయ్యారు. మీడియా ముందు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు .ఇక పోసానీ, అలీ, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇదిగో అదిగో అంటూ నామినేటెడ్ పదవులను .. చూపించడమే కానీ.. ఇచ్చింది లేదని, చివరకు ఇచ్చినా వద్దనే స్థితికి వారిని నేట్టివేశారని అంటారు. అయితే ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు విజయవాడ నియోజక వర్గం నుంచి పోటీచేసేందుకు, వైసీపీకి సరైన అభ్యర్ధి లేరు.ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్ధి కేసీనేని నాని గెలిచారు. ఆయనపై పోటీచేసిన వైసీపీ అభ్యర్ధి పొత్తూరి వరప్రసాద్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాగే, 2014లో పోటీ చేసిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ కూడా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.సో .. అభ్యర్ధి వేటలో ఉన్న వైసీపీ  నాగార్జునను తెర మీదకు తెచ్చిందని అంటున్నారు. అయితే, సహజంగానే వ్యాపార రాజకీయాలు తప్పించి ప్రత్యక్ష రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి లేని నాగార్జున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదనే అంటున్నారు.

 

Tags: Nag political entry

Post Midle