పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ ఆవరణంలో నాగులచవితి సందర్భంగా నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చిన తొలి పండుగ కావడంతో నాగపంచమిని మహిళలు భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. పురాణాల్లో అపారమైన ప్రాముఖ్యతను కలిగిన పండుగ నాగపంచమి సందర్భంగా నాగదేవతలకు పాలు పోసి చలిపిండి పెట్టి, మొక్కులు చెల్లించారు. నాగ చవితి రోజు సోదరుల సంక్షేమం కోరుతూ అక్క చెల్లెళ్లు పూజలు చేయడం ఆనవాయితీ.
Tags: Naga Panchami celebrations in Punganur