Natyam ad

కురబల సంఘ అధ్యక్షుడుగా నాగభూషణం

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా కురబల సంఘం అధ్యక్షుడుగా మార్లపల్లెకు చెందిన నాగభూషణంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు జబ్బాల శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం పట్టణంలో కురబల సంఘ సమావేశాన్ని నిర్వహించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వి.కోటకు చెందిన బలరాంను, ఉపాధ్యక్షులుగా శాంతిపురంకు చెందిన సుబ్రమణ్యం, వి.కోటకు చెందిన గోవిందప్ప ను ఎన్నుకున్నారు. అలాగే మహిళా అధ్యక్షురాలుగా పుంగనూరుకు చెందిన ఆర్‌.లతను ,యువత అధ్యక్షుడుగా ఎం.రెడ్డి, పులిచెర్ల సుధాకర్‌ను , యువత ఉపాధ్యక్షులుగా రామకుప్పంకు చెందిన ఆర్‌.గంగాధర్‌ను ఎన్నుకున్నారు.

Post Midle

పుంగనూరు…

పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షుడుగా రొంపిచెర్లకు చెందిన వెంకట్రమణను, ప్రధాన కార్యదర్శిగా పులిచెర్లకు చెందిన కొదండయ్యను, యువత అధ్యక్షులుగా పట్టణానికి చెందిన దినకర్‌ను ఎన్నుకున్నారు. యువత అధ్యక్షుడుగా పట్టణానికి చెందిన విజయకుమార్‌ను ఎన్నుకున్నారు. పులిచెర్ల మండల అధ్యక్షుడుగా కదిరి నరసింహులును ఎన్నుకున్నారు.

పలమనేరు నియోజకవర్గం…

నియోజకవర్గ అధ్యక్షులుగా వి.కోటకు చెందిన జయరాంగౌడు, ఉపాధ్యక్షులుగా గంగవరంకు చెందిన వసరాయగౌడు, కోశాధికారిగా బైరెడ్డిపల్లెకు చెందిన చిదంబరం, కార్యదర్శిగా వి.కోటకు చెందిన శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శిగా గంగవరంకు చెందిన రెడ్డెప్పను ఎన్నుకున్నారు.

 

Tags: Nagabhushan as the President of the Kurbala Sangha

 

Post Midle