నరసింహాస్వామి ఆలయ కమిటి చైర్మన్‌గా నాగరాజ

Nagaraja as chairman of Narasimhaswamy Temple Committee

Nagaraja as chairman of Narasimhaswamy Temple Committee

Date:14/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు సమీపంలోని గూడూరుపల్లె వద్ద వెలసియున్న శ్రీ లక్ష్మినరసింహాస్వామి ఆలయ నూతన కమిటి చైర్మన్‌గా కొండవీటి నాగరాజను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయంలో కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కొండవీటి నాగరాజను అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని త్వరలోనే ఎన్నుకోనున్నట్లు కమిటి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజ మాట్లాడుతూ ఆలయ పునరుద్దరణ పనులు రూ.3 కోట్లతో చేపట్టామని తెలిపారు. ఏడాదిలోపు పనులను పూర్తి చేసి, ఆలయాన్ని తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఎంతో ప్రసిద్ది చెందిన శ్రీ లక్ష్మినరసింహాస్వామి ఆలయానికి సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ఆయన ఆలయ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు కొండవీటి నాగముని, కొండవీటి నాగేంద్ర, కొండవీటి నటరాజ, భక్తవత్సలంరాజు, సుబ్రమణ్యం, ధనుంజయరాజుతో పాటు బెంగళూరుకు చెందిన దాతలు పురుషోత్తంరాజు తదితరులు పాల్గొన్నారు.

వలంటీర్లకు ఇంటర్వ్యూలు

Tags: Nagaraja as chairman of Narasimhaswamy Temple Committee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *