నాగ‌శౌర్య‌, అనీష్ కృష్ణ‌, ఐరా క్రియేష‌న్స్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన షర్లీ సేతియా

Date:21/11/2020

హైదరాబాద్‌ముచ్చట్లు:

హ్యాండ్స‌మ్ యాక్ట‌ర్ నాగ‌శౌర్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ కాంబినేష‌న్‌లో ఐరా క్రియేష‌న్స్ ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఇటీవ‌ల లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి జ‌ర‌గ‌నుంది. ఆక్లాండ్‌కు చెంది, ఫోర్బ్స్ మ్యాగ‌జైన్‌లో స్థానం పొందిన సంచ‌ల‌న గాయ‌ని, న‌టి షిర్లీ సేతియా ఈ మూవీలో నాగ‌శౌర్య జోడీగా ఎంపిక‌య్యారు. నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ‘మ‌స్కా’తో న‌టిగా మారిన షిర్లీ, త్వ‌ర‌లో ‘నిక‌మ్మా’ చిత్రంతో బాలీవుడ్‌లోనూ ప‌రిచ‌యం అవుతున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కునిగా అనీష్ కృష్ణ‌కు ఇది మూడో సినిమా. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, సాయి శ్రీ‌రామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.హీరో హీరోయిన్లు: నాగ‌శౌర్య‌, షర్లీ సేతియా

ఘట్టమనేని సితార క్లాప్, నమ్రత మహేష్ కెమెరా స్విచాన్ తో ప్రారంభమైన సూపర్ స్టార్ మహేష్ ‘సర్కారు వారి పాట’  

Tags: Nagashourya, Anish Krishna, Shirley Sethia chosen as the heroine in Ira Creations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *