పుంగనూరు వైఎస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ సంఘ నేతలుగా నాగభూషణం, మనోహర్‌

Date:27/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిలోని వైఎస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యోగ కార్మిక సంఘాల ఎన్నికలు బుధవారం రాష్ట్ర మున్సిపల్‌ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగాయి. గౌరవ అధ్యక్షుడుగా మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణంను ఎన్నుకున్నారు. అలాగే సంఘ అధ్యక్షుడుగా మున్సిపల్‌ అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌ , ఉపాధ్యక్షుడుగా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్ధర్‌అలి, జనరల్‌ సెక్రటరీ రసూల్‌ఖాన్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా వి.రామకృష్ణ, కార్యదర్శిగా శ్రీనివాసగౌడ, కోశాధికారిగా తిరుమలరావు, మహిళా కార్యదర్శిగా రమాదేవి, మహిళా ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా కృష్ణవేణి, మీడియా కోఆర్డినేటర్స్గా రమణారెడ్డి, నరేంద్రరాజు ను ఎన్నుకున్నారు. వీరితో పాటు మరో 12 మంది రెడ్డిశ్వరి, రెడ్డెమ్మ, నాగయ్య, హేమలత, కృష్ణమ్మ, శ్రీరాములు, శివకుమార్‌, గండికోట రమేష్‌బాబు, శ్రీకాంత్‌రెడ్డి, గోపాలకృష్ణమూర్తి,లక్ష్మణ్‌కుమార్‌, సుదర్శన్‌రాజులను కమిటి మెంబర్లుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ ఉద్యోగ, కార్మిక సంఘాల నిధి ఏర్పాటు చేస్తామన్నారు. నిధికి తొలి విరాళంగా రూ.1.10 లక్షలు ఇచ్చారు. ఈ నిధిని పెంపు చేసి, ఉద్యోగ కార్మికులకు ఆపదలో ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని, సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, ఏఈ కృష్ణకుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్రబాబు, కార్మిక సంఘ నాయకులు శ్రీరాములు, నాగయ్యతో పాటు మున్సిపాలిటిలోని అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tags: Nagbhushanam, Manohar as community leaders of Punganur YSR Trade Union

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *