Natyam ad

సాహస పురస్కారానికి నాగేంద్ర ఎంపిక

కడప ముచ్చట్లు:

సాహసోపేతంగా వ్యవహ రించి ప్రాణాలు కాపాడిన వారిని ప్రోత్సహిస్తూ ‘అన్ సంగ్ హీరోస్’ పేరిట వి.ఐ.టి (వెల్లూర్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, అమరావతి) నిర్వాహకులు ప్రతి ఏటా అవార్డులు అందచేస్తున్నారు. అందులో భాగంగా జిల్లా నుండి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ బి.నాగేంద్ర (ఎంఆర్ పిసి 2232) అవార్డుకు నామినీగా ఎంపిక కావడం పట్ల జిల్లా ఎస్.పికే.కే.ఎన్ అన్బురాజన్  ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద ఎంపికైన ముగ్గురు నామినీల్లో జిల్లాకు చెందిన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ ఉండటం అభినందనీయమన్నారు.  వివరాల్లోకెళితే.. గత ఏడాది నవంబర్ లో ఆర్.కే వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపాగ్ని నది వంతెనపై వరద నీటిలో అద్దాలమర్రి కి చెందిన 14 మంది గ్రామస్థులు చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసు సిబ్బందిలో ఎస్.ఐ వాహన డ్రైవర్ గా విధుల్లో ఉన్న నాగేంద్ర సమయ స్పూర్తితో పాటు సాహసోపేతంగా తాడు సాయంతో గ్రామస్థులను ఒక్కొక్కరినీ సురక్షిత ప్రాంతానికి చేర్చి గ్రామస్థుల, పోలీసు ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక వి.ఐ.టి ‘అన్ సంగ్ హీరోస్’ అవార్డుకు నామినీగా ఎంపిక కావడం పట్ల తోటి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 15 న నిర్వహించే కార్యక్రమం లో అవార్డు గ్రహీతలను వి.ఐ.టి నిర్వాహకులు ప్రకటించనున్నారు.

 

Tags:Nagendra’s selection for the Sahasha Award

Post Midle
Post Midle