Date:30/11/2020
విజయవాడ ముచ్చట్లు:
మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం చేసిన నిందితుడు నాగేశ్వరరావుపై సెక్షన్ 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్
ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో 4 బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఘటన అనంతరం మంత్రి పేర్నినాని ఇంటి వద్ద భద్రతను పెంచారు. స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు
చేశారు. మంత్రిని కలవడానికి వచ్చే ప్రతి ఒక్కరినీ భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మంత్రి నాని పై ఆదివారం ఉదయం హత్యాయత్నం జరిగింది. బడుగు నాగేశ్వరరావు అనే
టీడీపీ కార్యకర్త పదునైన సన్నపాటి తాపీ (భవన నిర్మాణాల సందర్భంగా మేస్త్రీలు ఉపయోగించే పనిముట్టు)తో మంత్రిని రెండుసార్లు పొడవగా.. ఆయన అదృష్టవశాత్తు తప్పించుకున్నారు.
ధర్మపురి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు
Tags: Nageswara Rao is accused of attempting to assassinate Nani