నాగులచవితి

శ్రీశైలం ముచ్చట్లు:


నాగులచవితిని కొన్ని ప్రాంతాలలో శ్రావణమాసంలో ఆచరిస్తుండగా, మరికొన్ని చోట్ల కార్తీకమాసంలో ఆచరిస్తున్నారు. ఈ కారణంగా శ్రావణ శుద్ధ చవితి అయిన సోమవారం రోజున పలువురు భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద నాగదేవతలను పూజించారు. సోమవారం రోజు వేకువజాము నుండి భక్తులు నాగులకట్ట వద్దకు చేరుకొని పత్తితో చేసిన వస్త్రం, యజ్ఞోపవీతం, పలురకాల పుష్పాలు మొదలైన వాటితో నాగమూర్తులను అలంకరించి పాలతో అభిషేకించారు. తరువాత నువ్వులపిండి, చలిమిడి, వడపప్పులను నివేదించారు. కాగా మన సంస్కృతిలో నాగసంప్రదాయానికి ఎంతో ప్రాముఖ్యం వుంది. అదేవిధంగా శ్రీశైలంలో కూడా పలుచోట్ల నాగవిగ్రహాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆలయ ప్రాకారకుడ్యంపై పలుచోట్ల నాగశిల్పాలను దర్శించవచ్చు. ఈ నాగశిల్పాలలో తూర్పు ప్రాకారంపై గల ఆదిశేషుడు, దక్షిణవైపున గల నాగబంద శిల్పం ముఖ్యమైనవి.కాగా భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం ఇటీవల సర్పదోష నివారణ పూజలు నిత్య ఆర్జితసేవగా ప్రతీరోజు మూడు విడతలుగా ఉదయం గం 8.30లకు, ఆ తర్వాత గం. 11.30లకు తిరిగి సాయంకాలం గం. 5.30 లకు ఈ సర్పదోష నివారణ పూజలు జరిపించబడుతాయి. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా కోరుచున్నాము.

 

Tags: Nagulachavithi

Leave A Reply

Your email address will not be published.