పుంగనూరులో నాయిబ్రాహ్మణులు సంబరాలు
పుంగనూరు ముచ్చట్లు:
జగనన్నచేదోడు పథకం క్రింద నాయిబ్రాహ్మణులకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించినందుకు సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరిపారు. శుక్రవారం సంఘ నాయకుడు హేమంత్, లయన్స్ క్లబ్ జిల్లా పీఆర్‌వో డాక్టర్ శివ , దళిత నాయకుడు రాజు ఆధ్వర్యంలో నాయిబ్రాహ్మణులు కేక్ కట్ చేసి , సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల చిత్రపటాలను ప్రదర్శించారు. బాణసంచాలు పేల్చి సంబరాలు జరిపారు. సీఎం జిందాబాద్…పెద్దిరెడ్డి జిందాబాద్‌అంటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హేమంత్ మాట్లాడుతూ అన్ని వర్గాల పేదలను ఆదుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోవు ఎన్నికల్లో నాయిబ్రాహ్మణులు వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వెంకట్రమణ, కుమార్, సతీష్, తులసి, రమణ, బద్రి, రవి తదితరులు పాల్గొన్నారు.

Tags: Nai Brahmins celebrate in Punganur
