కర్నూలు నగరంలో ఆర్ధరాత్రి నాకా బందీ

కర్నూలు ముచ్చట్లు:


కర్నూలు నగరంలో గురువారం అర్ధరాత్రి నాకా బందీ,  ఆకస్మిక తనిఖీలను జిల్లా ఎస్పీ  సిద్దార్థ్ కౌశల్చేసారు. గస్తీ సిబ్బంది పనితీరును అయన ఆరా తీసారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రహదారులపై తిరుగుతున్న పలువురి వాహనాలను ఆకస్మికంగా ఆపి తనిఖీ చేయించారు.కర్నూలు నాలగవ పట్టణ పోలీసుస్టేషన్ , కర్నూలు రెండవ పట్టణ పోలీసుస్టేషన్ , కర్నూలు ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ ,  కర్నూలు మూడవ పట్టణ  పోలీసు స్టేషన్ పరిధులలోని కృష్ణా నగర్ , గుత్తి పెట్రోల్ బంక్,  ఆర్ ఎస్ రోడ్డు, రైల్వే స్టేషన్, బంగారు పేట,  కల్లూరు దర్వాజ , గణేష్ నగర్, జోహారాపురం, బుధవార పేట, వినాయక్ ఘాట్, సి.క్యాంపు లలో  అయన  ఆకస్మికంగా పర్యటించి తనిఖీలు నిర్వహించారు.    నేరాల నివారణకు రాత్రి పూట గస్తీ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.  అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను తనిఖీలు చేయాలి.     రాత్రి గస్తీని ముమ్మరం చేయాలి. న్నారు. రాత్రి గస్తీలు  సక్రమంగా నిర్వహిస్తే  దొంగతనాలను అరికట్టవచ్చని  సూచించారు.   విధి నిర్వహణలో సిబ్బంది క్రమశిక్షణతో బాధ్యతగా వ్యవహరించాలన్నారు.  జిల్లా ఎస్పీ తో పాటు కర్నూలు పట్టణ డిఎస్పీ మహేష్, సిసియస్ డిఎస్పీ శ్రీనివాసులు,  స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్,  కర్నూలు నాలగవ పట్టణ సిఐ శంకరయ్య,  కర్నూలు త్రీ టౌన్ సిఐ తబ్రేజ్ , ఫోర్త్  టౌన్  ఎస్సై రామయ్య, కర్నూలు టు టౌన్  ఎస్సై ఖాన్  ఉన్నారు.

 

Tags: Naka Bandi in the middle of the night in Kurnool city

Leave A Reply

Your email address will not be published.