పుంగనూరులోని నక్కబండ ప్రాంతం 5వ సచివాలయ పరిధిలోకి
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలో ఉన్న నక్కబండ ప్రాంతాన్ని మున్సిపాలిటిలోని 5వ సచివాలయ పరిధిలోకి కలిపినట్లు కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి తెలిపారు. సోమవారం చైర్మన్ అలీమ్‌బాషా , 15 వార్డు కౌన్సిలర్ మనోహర్‌తో కలసి సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో తొలి సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ నక్కబండ పట్టణంలో కలిసి ఉండటంతో రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ప్రాంతాన్ని మునిన్సిపాలిటిలో చేర్పించారన్నారు. సుమారు 2300 మంది జనాభా కలిగిన నక్కబండలో ప్రభుత్వ సేవలను 5వ సచివాలయం నుంచి అందించడం జరుగుతుందన్నారు. సిబ్బంది , వలంటీర్లు ఎలాంటి నిర్లక్ష్యము వహించకుండ నక్కబండలో అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు. ఏ సమస్య వచ్చిన తమ ధృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు నక్కబండలో వేగవంతం చేశామన్నారు. రోడ్లు, కాలువలు, దాదాపుగా పూర్తికావస్తోందన్నారు. కౌన్సిలర్ మనోహర్ మాట్లాడుతూ మున్సిపాలిటిలో చేరిన నక్కబండలో ఇంటింటికి వెళ్లి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామన్నారు. మున్సిపాలిటిలో చేర్పించినందుకు మంత్రి పెద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సచివాలయ కార్యద ర్శి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:Nakkabanda area of Punganur is under 5th secretariat
