Nakkabanda, who joined the municipality

మున్సిపాలిటిలోకి చేరిన నక్కబండ

– ఉత్తర్వులు తీసుకున్న పెద్దిరెడ్డి , కమిషనర్‌ వర్మ

Date:20/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండల పరిధిలో ఉన్న నక్కబండ, రామచంద్రారెడ్డి నగర్‌లను మున్సిపాలిటి పరిధిలోకి కలుపుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, అక్కిసాని బాస్కర్‌రెడ్డి , మాజీ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, మాజీ కౌన్సిలర్‌ అమ్ము ఆధ్వర్యంలో కెఎల్‌.వర్మకు ఉత్తర్వులను ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, మాజీ ఎంపీపీ అంజిబాబుతో కలసి అందజేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రెండు ప్రాంతాలను మున్సిపాలిటిలోకి విలీనం చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు ఎంపీడీవో జనాభా తో పాటు డోర్‌నెంబర్లను మున్సిపాలిటికి అందజేయడం జరిగిందన్నారు. వీటి చేరికతో మున్సిపాలిటిలో వార్డుల సంఖ్య 31 కి పెరిగిందన్నారు. మున్సిపాలిటి పరిధిలో ఈరెండు ప్రాంతాల్లోను అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా చేపడుతామని ఆయన తెలిపారు. ఈ విలీనంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, ఆర్‌వో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలపై కమిషనర్ శ్రీధర్ కు వినతి

Tags: Nakkabanda, who joined the municipality

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *