Natyam ad

ఓట్లను బహిష్కరించిన నల్లబండపాడు గ్రామస్తులు

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:


జూలూరుపాడు మండలం నల్లబండపాడు గ్రామస్తులు గురువారం జరిగిన ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంపై స్పష్టమైన హామీ వస్తేనే ఓట్లు వేస్తామని భీష్ముంచు కూర్చున్నారు. మండల కేంద్రానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి అనంతారం గ్రామం వరకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.గర్భిణీ లు ఎవరైనా అనారోగ్యం పాలైతే వారిని హాస్పటల్ కు తరలించేందుకు రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో 108 వాహనంతో పాటుగా ఇతర వాహనదారులు సైతం తమ గ్రామానికి రావడంలేదని ఆరోపిస్తున్న గ్రామస్తులు.

స్వాతంత్రం రాకముందు ఏర్పడిన తమ గ్రామానికి ఇప్పటివరకు రోడ్డు మార్గం లేదని కానీ ఈ మధ్యకాలంలో ఏర్పడిన గ్రామాలకు రోడ్డు మార్గం ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.గత ఎన్నికల్లో సైతం ఇదేవిధంగా ఓట్లను ఓట్లను బహిష్కరించామని అప్పుడు కూడా అధికారులు కచ్చితంగా తమ గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు తప్ప ఇప్పటివరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టలేదని ఆరోపించారు. పాలకులు అధికారులు రోడ్డు మార్గం నిర్మిస్తామని హామీ ఇస్తున్నారే తప్ప ఏళ్లు గడిచిన ఇప్పటివరకు తమ గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.

 

Post Midle

Tags: Nallabandapadu villagers boycotted the votes

Post Midle