నామట్టి,నాదేశంను జయప్రదం చేయండి
పుంగనూరు ముచ్చట్లు:
అజాదికాఅమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న నామట్టి,నాదేశం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. గురువారం మండలంలోని చండ్రమాకులపల్లె సచివాలయం వద్ద కార్యక్రమంలో భాగంగా ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, సచివాలయాల కన్వీనర్ చెంగారెడ్డితో కలసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశాన్ని కాపాడేందుకు ఎంతో మంది వీరులు ఆశువులు బాసారని, వారందరికి వందనాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అజాదీకా అమృత్ మహ్గవత్సంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు నామట్టి, నాదేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, జయనారాయణరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, రమణ, బావాజాన్, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags: Namatti, make Nadesa Jayaprad
