పేరు తీసేశారని… ఆత్మహత్య

మెదక్  ముచ్చట్లు:
తెలంగాణ   ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కీం కింద ఇళ్ల కోసం ఇప్పటికే అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొందరు డబుల్ డెడ్ రూం ఇళ్ల కోసం ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తనకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలంటూ గౌతమ్ అనే యువకుడు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించి ఎల్లారెడ్డి పేటలో రెవెన్యూ అధికారులు సర్వే కూడా చేశారు. డబుల్ బెడ్‌రూమ్ అర్హుల లిస్టులో గౌతమ్ పేరును పేర్కొని..చివరి లిస్టులో తొలగించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గౌతమ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.హైదరాబాద్‌లోని రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగి వద్ద ప్రైవేటు కారు డ్రైవర్‌గా పని చేస్తున్న గౌతమ్.. 10 రోజులుగా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కోసం ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాడు. ఇక తనకు ఇల్లు రాదనుకుని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసున్నాడు. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన గౌతమ్ తనువు చాలించడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Name taken … Suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *