శాసన మండలి చైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్..

హైదరాబాద్: శాసన మండలి చైర్మన్ పదవి కోసం తెరాస ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి మహమూద్ అలీ, సత్యవతి రాతోడ్, జగదీష్ రెడ్డి తదితరులతో కలిసి శాసనసభ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ రెండోసారి శాసన మండలి ఛైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశాన్ని కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన ఏకగ్రీవానికి సహకరించిన సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో మాదిరిగానే సభను హుందాగా నడిపించేందుకు కృషి చేస్తానని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు..