నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ ‘#NBK108 విజయదశమి (దసరా)కి
విడుదల
సినిమా ముచ్చట్లు:

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK108 తగినంత ఫ్యామిలీ ఎలిమెంట్స్ రూపొందుతోంది. డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు, దసరాకి NBK108ని విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. “విజయదశమికి ఆయుధ పూజ” అని అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బాలకృష్ణ చాలా ఇంటెన్స్ కనిపిస్తున్నారు. పోస్టర్ లో కాళీమాత విగ్రహం కూడా వుంది.కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.#NBK108కి ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా, సిరామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
తారాగణం: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల
Tags;Nandamuri Balakrishna, Anil Ravipudi, Shine Screens’ #NBK108 for Vijayadashami (Dussehra)
