నందమూరి బాలకృష్ణ జన్మదిన సంబరాలు

జిల్లా ఉపాధ్యక్షులు స్థానిక నివాసంలో బాలయ్య జన్మదిన వేడుకలు
నటన లో  వేరేవారు లేరు సాటి అబ్దుల్ రాహిమాన్

కౌతాళం   ముచ్చట్లు:

కౌతాళం మండలం లో యువరత్న నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా   ఎన్.బి.కె ఫ్యాన్స్ అధ్యక్షుడు రెహమాన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్ప స్థానిక నివాసం అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాలకృష్ణ చిత్ర పటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలుగుదేశం నాయకులు చెన్న బసప్ప, వెంకటపతి రాజు, కురువ సంఘము కార్యదర్శి విరేశ్ మాట్లాడుతూ ప్రతి సం బాలయ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాల ఆనందంగా ఉంది రాజకీయాల్లో హిందు పురం ఎమ్మెల్యే, నటనలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు నందమూరి తారకరామారావు తర్వాత సినిమా కె వన్నె తెచ్చిన సినీ దిగ్గజూడు మన బాలయ్య అని అతను జన్మదిన వేడుకలు జరుపుకోవద్దని చెప్పిన అభిమానులు ముందు అది అసాధ్యమని తేల్చిచెప్పారు. ఇంతటి అభిమానులు మా తెలుగుదేశం లో ఉన్నందున మాకు గర్వంగా ఉందని తెలియజేశారు. అందరి బాలయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముస్లిం మైనారిటీ మండల కార్యదర్శి అబ్దుల్ రాహిమాన్ అద్వర్యం లో సాధువులకు,అనాథ లకు దుప్పట్లు, మాస్క్ లు పంచి పెట్టారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పెంచిపెట్టారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపధ్యక్షుడు చన్న బసప్ప,టిడిపి రైతు కమిటీ జిల్లా ఉపాధ్యక్షడు వేంకటపతి రాజు,టిడిపి ముస్లిం  మైనారిటీ మండల కార్యదర్శి బాలకృష్ణ అభిమానీ రెహమాన్,  కాశీ విశ్వనాథ్,డా. రాజానంద్,మంజు, రాజబాబు,శివ, క్రిష్ణ కాంత్,పెద్ద ఈరప్పా,ముకన్న, బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Nandamuri Balakrishna Birthday Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *