ఘనంగా నందమూరి బాలకృష్ణ 59 వ జన్మదిన వేడుకలు

Nandamuri Balakrishna's 59th birthday celebrations

Nandamuri Balakrishna's 59th birthday celebrations

Date:10/06/2019

కౌతాళం ముచ్చట్లు:

కౌతాళం మండలంలో నందమూరి అభిమానులు సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానుల సంఘం అధ్యక్షులు రహిమన్,నరసింహ అధ్వర్యంలో బాలకృష్ణ 59 వ జన్మ దిన వేడుకలు మండల పరిధిలోని ఊరుకుంద గ్రామంలో బాలకృష్ణ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.ముందుగా బాలకృష్ణ చిత్ర పటానికి  పూలమాలలు వేసి ఆశీర్వదించారు. కేకు ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జన్మదిన సందర్భంగా ఊరుకుంద నిత్యాన్నదాన కార్యక్రమానికి  2,516 రూపాయలు ఆలయ అధికారులు కు విరాళంగా అందజేశారు. అభిమానులు మాట్లాడుతూ మరిన్ని సినిమాలకు విజయాలు అందించాలని ప్రజలకు సందేశనిచ్చే సినిమాలు తీయాలని పిలుపు నిచ్చారు. పలు గ్రామాల్లో నందమూరి అభిమానులు బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ జన్మ దిన వేడుకలు కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు సంఘం అధ్యక్షులు రహీమన్, నరసింహ, గోపాల్, బజారి, బసవ, నరసన్న, ఉషేన్ ఆలం,తదితరులు, అభిమానులు పాల్గొన్నారు.

బాపురం బ్రిడ్జి రాకపోకలు బంద్

Tags: Nandamuri Balakrishna’s 59th birthday celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *