Natyam ad

నందమూరి ఇంట విషాదం

హైదరాబాద్  ముచ్చట్లు:


నందమూరి కుటుంబలో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ నాల్గవ కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి హఠాన్మరణం చెందారు. దీంతో..ఒక్క సారిగా ఆ కుటుంబంలో అందరూ షాక్ కు గురయ్యారు. ఊహించని పరిణామంతో నందమూరి కుటుంబంతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..భువనేశ్వరి- బ్రాహ్మణి సైతం ఉమా మహేశ్వరి ఇంటికి చేరుకుంటున్నారు. లోకేష్ -జూనియర్ ఎన్టీఆర్ విషయం తెలిసిన వెంటనే తన మేనత్త ఇంటికి చేరుకున్నారు. బాలయ్య కూడా చేరుకుంటున్నట్లు తెలుస్తోందిఇక, ఇప్పటికే దగ్గుబాటి పురంధేశ్వరి – దగ్గుబాటి వేంకటేశ్వ రావు అక్కడకు చేరుకున్నారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తెకు వివాహం జరిగింది. ఆ సమయంలోనే చంద్రబాబు – దగ్గుబాటి కలుసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొంత కాలంగా ఉమామహేశ్వరి అస్వస్థతతో ఉన్నారు.

 

 

చికిత్స తీసుకుంటున్నారు.అయితే, కొద్ది సేపటి క్రితం సడన్ గా కార్డియాక్ అరెస్ట్ తో జాబ్లీహిల్స్ లోని నివాలసంలో ఉమా మహేశ్వరి తుది శ్వాస విడిచారు. ఈ ఉదయం సమయంలోనే బాగానే ఉన్నారని..సడన్ గా గుండె నొప్పితో కుప్ప కూలారని తెలుస్తోంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తో చాలా క్లోజ్ గా ఉండేవారని చెబుతారు. ఉమా మహేశ్వరి హఠాన్మరణం విషయం తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. నందమూరి కుటుంబ సభ్యులంతా రేపటికి హైదరాబాద్ చేరుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. నందమూరి కుటుంబంలో విషాదం ఉమా మహేశ్వరి మరణం తో నగరంలో అందుబాటులో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కక్కొరు అక్కడకు చేరుకుంటున్నారు. ఎన్టీఆర్ కుమార్తెల్లో ఉమామహశ్వరి చిన్నవారు. బాలయ్య కు సమాచారం అందించారు. ఎన్టీఆర్ కుటుంబంతో అనుబంధం ఉన్నవారంతా ఉమా మహేశ్వరి నివాసానికి తరలి వస్తున్నారు. ఆకస్మికంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగి పోయారు. ఉమా మహేశ్వరితో అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు.

 

Post Midle

Tags: Nandamuri house tragedy

Post Midle