మా ఎన్నికల్లో నందమూరి హీరో

హైదరాబాద్ ముచ్చట్లు:

 

టాలీవుడ్‌లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో ఫిలిం నగర్ వాతవరణం వేడెక్కింది. ఎక్కడ చూసినా ఈ టాపిక్ పైనే చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్ నటుడు ప్ర‌కాశ్ రాజ్‌, మంచు మోహన్ బాబు తనయుడు హీరో మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ ఉండగా.. తాజాగా నందమూరి వారసుడు, హీరో కళ్యాణ్ రామ్ కూడా పోటీలో నిలుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి చూసి కళ్యాణ్ రామ్ టీమ్ వెంటనే స్పందించి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.గతంలో జరిగిన ‘మా’ ఎన్నికలు ఎంత సెన్సేషన్ అయ్యాయో తెలిసిందే. నటీనటుల మధ్య వార్ రసవత్తరంగా సాగి హాట్ టాపిక్ అయింది. ఇక ఈ సారి సీన్ చూస్తుంటే అంతకుమించి అన్నట్లుగా కనిపిస్తోంది. బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ ఎవరికి వారు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. మరోవైపు ఇప్పటికే అనసూయ, ప్రగతి, సుడిగాలి సుధీర్ లాంటి ట్రెండింగ్ స్టార్స్‌తో ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ప్రకటించారు. ఇలాంటి సిచుయేషన్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా రంగంలోకి దిగుతున్నారనే న్యూస్ వైరల్ అయింది.బాబాయ్ నందమూరి బాలకృష్ణ కోరిక మేరకు కళ్యాణ్ రామ్ రేసులోకి వస్తున్నారని టాక్ నడిచింది. దీంతో ఈ విషయమై కళ్యాణ్ రామ్ టీమ్ రియాక్ట్ అయ్యారు. దయచేసి ఇలాంటి రూమర్స్ నమ్మకండి, మా అధ్యక్ష ఎన్నికల్లో కళ్యాణ్ రామ్ పోటీ చేయడం లేదు అని ప్రకటించారు. మరోవైపు ఈ రేసులో సాయి కుమార్ కూడా ఉండబోతున్నారనే సమాచారాలు షికారు చేస్తున్నాయి. ఏదేమైనా ట్విస్టుల మీద ట్విస్టులతో ‘మా’ ఎలక్షన్స్ జనాల్లో చర్చనీయాంశం అయ్యాయి. సీనియర్ స్టార్ హీరోల మద్దతు ఎవరికి లభిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

 

 

ప్రకాష్ రాజ్ టీమ్ లో… అనసూయ, జయసుథ
ప్రస్తుతం టాలీవుడ్‌లో
మా ఎన్నికలు సెగలు రేపుతోంది. ఈ సారి త్రిముఖి పోటి నెలకొనేలా ఉంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు ఆల్రెడీ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే నటి హేమ కూడా తలపడేందుకు సిద్దమైంది. ఈక్రమంలో ఎన్నెన్నో వార్తలు, ప్రచారాలు ఊపందుకున్నాయి. అయితే ఏది ఎలా ఉన్నా కూడా ప్రకాష్ రాజ్ మాత్రం దూసుకుపోయేందుకు తన టీంను రెడీ చేసుకున్నారు. ఇప్పుడే ఎన్నికల వేడి మొదలైనట్టు.. ఆరోపణలు, వాగ్వాదాలు, ఎదురుదాడికి దిగుతున్నారు.ప్రకాష్ రాజ్ మీద ఇప్పటికే విమర్శనాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. పరభాషా నటుడు మా అధ్యక్షుడిలా ఉంటారు.. ఎలా ఎన్నుకుంటారంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినా కూడా ప్రకాష్ రాజ్ ఇలాంటివేమీ పట్టించుకోకుండా తన బలాన్ని పెంచుకుంటూ పోతోన్నారు. ఇప్పటికే మెగా కాంపౌండ్ మద్దతు లభించేసింది. ఇక తాజాగా తన ప్యానెల్‌ మెంబర్స్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.సిని’మా’ బిడ్డ‌లం.. మన‌కోసం మ‌నం.. ‘మా’ కోసం మ‌నం.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే MAA ఎల‌క్ష‌న్స్‌ని పుర‌స్క‌రించుకుని, ‘మా’ శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌ల‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్ర‌తిష్ట‌కోసం.. మ‌న న‌టీ నటుల బాగోగుల కోసం.. సినిమా న‌టీన‌టులంద‌రి ఆశీస్సుల‌తో.. అండ‌దండ‌ల‌తో.. ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డటం కోసం.. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్ర‌మే చేయ‌డం కోసం.. ‘మా’ టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నామని ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ టీంను పరిచయం చేశారు.జ‌య‌సుధ‌, శ్రీకాంత్‌, బెన‌ర్జీ, సాయికుమార్‌, తనీష్‌, ప్ర‌గ‌తి, అన‌సూయ‌, స‌న, అనిత చౌద‌రి, సుధ‌, అజ‌య్‌, నాగినీడు, బ్ర‌హ్మాజీ, ర‌విప్ర‌కాష్‌, స‌మీర్‌, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్‌, శివారెడ్డి, భూపాల్‌, టార్జ‌ాన్‌, సురేష్ కొండేటి, ఖ‌య్యుం, సుడిగాలి సుధీర్, గోవింద‌రావు, శ్రీధ‌ర్‌రావు మ‌రికొంద‌రు ప్ర‌ముఖుల‌తో అంటూ ప్రకాశ్ రాజ్ తన లిస్ట్‌ను ప్రకటించేశారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Nandamuri is the hero in our election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *