నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’

సినిమాముచ్చట్లు

డేరింగ్ అండ్ డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె నిర్మిస్తోన్న చిత్రానికి ‘బింబిసార’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది. శుక్ర‌వారం స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి సంద‌ర్భంగా మైథిలాజికల్ టచ్‌తో సాగే ‘బింబిసార’ టైటిల్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన క‌ళ్యాణ్ రామ్ మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఇందులో క‌ళ్యాణ్ రామ్ లుక్‌, బ్యాక్‌డ్రాప్ అన్ని సరికొత్త‌గా ఉన్నాయి…క్రూరుడైన బింబిసారుడు లుక్‌లో యుద్ధ రంగంలో శ‌త్రు సైనికుల‌ను చంపి వారి శ‌వాల‌పై ఠీవిగా కూర్చున్న క‌ళ్యాణ్ రామ్ లుక్ టెరిఫిక్‌గా ఉంది. తొలిసారిగా క‌ళ్యాణ్ రామ్ ఇలాంటి మైథిలాజిక‌ల్ పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో పాటు, ఆ పాత్ర లుక్‌, బ్యాక్ డ్రాప్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది.
‘గ‌త ఏడాది షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ కీల‌కంగా.. భారీ సెట్స్‌తో క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నిక‌ల్ వేల్యూస్ మూవీ ఇది. కరోనా ఉధృతి కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆగింది. కొవిడ్ ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డ‌గానే షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ‘బింబిసార’ చిత్రాన్ని విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నాం’ అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి పాట‌లు:  సిరి వెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి, డాన్స్‌:  శోభి, ర‌ఘు, ఫైట్స్‌:  వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:  అనిల్ ప‌డూరి, ఆర్ట్‌:  కిర‌ణ్ కుమార్ మ‌న్నె, ఎడిట‌ర్‌:  త‌మ్మిరాజు, మ్యూజిక్‌:  చిరంత‌న్ భ‌ట్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ఛోటా కె.నాయుడు, ప్రొడ్యూస‌ర్‌: హ‌రికృష్ణ.కె, ద‌ర్శ‌క‌త్వం: వ‌శిష్ఠ్‌.

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags:Nandamuri Kalyan Ram ‘Bimbisara’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *