నంద్యాల, ఆళ్లగడ్డ లు టీడీపీకి సవాల్

Nandhiala and Alagalai are challenging to TDP

Nandhiala and Alagalai are challenging to TDP

Date:13/04/2018
కర్పూలు ముచ్చట్లు:
ఎన్నికలు ఇంకా ఏడాది ఉండగానే నంద్యాల హీటెక్కింది. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు ఈసారి తెలుగుదేశం పార్టీకి సవాల్ గా మారనున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో అంత:కలహాలు పతాక స్థాయికి చేరుతున్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిల్లో ఇద్దరు నేతల మధ్య విబేధాలు ఇప్పటికే రచ్చకు ఎక్కాయి. వాళ్లిద్దరూ బహిరంగంగానే సవాళ్లు చేసుకొంటూ ఉన్నారు. వారిద్దరూ ఎవరో కాదు.. మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి. వీళ్లిద్దరూ మొన్నటి వరకూ సఖ్యతగా మెలిగిన వాళ్లే.. భూమా నాగిరెడ్డి బతికి ఉన్న సమయంలో ఆయనకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించారు ఏవీ సుబ్బారెడ్డి.పార్టీలో ఏర్పడిన విభేదాలు తొలగించడం అధినేతకు కూడా ఇక ఏమాత్రం సాధ్యం కాదని వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో భూమా వర్గానికి వచ్చే ఎన్నికల్లో పెద్ద దెబ్బతగిలే సూచనలు కన్పిస్తున్నాయి. నంద్యాలలో ఈసారి సీటు తమ అల్లుడికే ఇవ్వాలని నంద్యాల ఎంపీ ఎస్సీవై రెడ్డి కోరుతుండగా, ఆళ్లగడ్డ టిక్కెట్ తనకే దక్కాలంటూ ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే అధిష్టానానికి సంకేతాలు పంపారు. ఏవీ సుబ్బారెడ్డి ఇటీవల ఏర్పాటు చేసి ఏవీ హెల్ప్ లైన్ కు విశేష స్పందన లభిస్తోందని చెబుతున్నారు. మంత్రి భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఈ ఏవీ హెల్ప్ లైన్ రోజుకు వందకు పైగానే కాల్స్ వస్తుండం ఏవీ పట్ల ఉన్న ఆదరణకు నిదర్శనమని ఆయన అనుచరులు చెబుతున్నారు. భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, అనుచరులకు, ప్రజలకు అప్పట్లో అందుబాటులో ఉంది ఏవీ సుబ్బారెడ్డి మాత్రమేనని వారు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ప్రతి ఇంటిలో మనిషిగా ఏవీ ఇప్పటికీ ఆళ్లగడ్డలో వ్యవహరిస్తారని చెబుతున్నారు.మంత్రి అఖిలప్రియ మాత్రం ఏవీ సుబ్బారెడ్డి విషయంలో దిగి వచ్చేట్లు కన్పించడం లేదు. ఏవీని మామగా పిలిచే అఖిలప్రియ ఆయనను మరింత దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రపై ఇప్పటికే ముఖ్యమంత్రి చ్రందబాబుకు, మంత్రి లోకేష్ కు వివరించినట్లు చెబుతున్నారు. మంత్రి లోకేష్ ఏవీ విషయాన్ని ఇన్ ఛార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులుతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే కాల్వమాత్రం వీరిద్దరి విషయం తేల్చడం తన వల్ల కాదని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కాల్వ కూడా కోరినట్లు చెబుతున్నారు.నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో కేబుల్ టీవీ వ్యవహారాల్లో.. ఇప్పుడు వీరిరువురి మధ్యన రచ్చ రేగినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యాపారం భూమా, ఏవీ వర్గాల చేతుల్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కేబుల్ టీవీలో ప్రసారం అయ్యే స్థానిక వార్తల్లో అఖిలప్రియ ప్రస్తావన లేకుండా సుబ్బారెడ్డి ఆదేశాలిచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అటు అఖిలప్రియ వార్తలు కానీ, ఇటు నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వార్తలు కానీ.. కేబుల్ టీవీలో చూపకుండా ఏవీ ఆదేశాలించారని సమాచారం. ఈ విషయంలో మంత్రి అసహాయురాలు అయ్యిందని నంద్యాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అఖిల, ఏవీ సుబ్బారెడ్డిలు బహిరంగంగా దూషించుకోవడంతో.. ఇకపై ఈ రచ్చ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇటీవల రెండు వర్గాలు యార్డు వద్ద రైతులకు అన్నదానం చేసే విషయంలో కూడా గొడవ పడ్డాయి. అలాగే తాజాగా కేబుల్ వార్ కూడా మొదలయింది. నంద్యాల సిటీ కేబుల్ లో మంత్రి అఖిలప్రియ వార్తలను ప్రసారం చేయవద్దంటూ ఏవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై మంత్రి అఖిలప్రియ తన వార్తలను ఎందుకు ప్రసారం చేయరంటూ కేబుల్ యజమానిని నిలదీశారు. కేబుల్ లో తమకూ వాటాలున్నాయని ఆమె గుర్తు చేశారు. అయితే ఆ కేబుల్ యజమాని మాత్రం ఏవైనీ ఉంటే ఏవీ సుబ్బారెడ్డితో మాట్లాడుకోవాలని సూచించారు. ఇలా నంద్యాల రాజకీయాలు మాత్రం నడిరోడ్డుపై చేరాయి. అయితే మరికాసేపట్లో చంద్రబాబుతో ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ సమావేశం కాబోతున్నారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు వీరిద్దరినీ తీసుకుని చంద్రబాబు వద్దకు వెళ్లారు. మరి ఈ వివాదం ఇప్పటికైనా ముగుస్తుందో లేదో  చూడాలి.
Tags: Nandhiala and Alagalai are challenging to TDP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *