Natyam ad

నేర సమీక్షా సమావేశం నిర్వహించిన నంద్యాల జిల్లా ఎస్పీ

నంద్యాల ముచ్చట్లు:


నంద్యాల జిల్లా ఎస్పీ  రఘువీర్ రెడ్డి  నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో  నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశం లో పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.పోలీస్ స్టేషన్ల వారీగా అండర్ ఇన్వెస్టుగేషన్  కేసులు తగ్గించుకోవాలన్నారు. నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు.
హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ అగైనెస్ట్ ఉమన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సిఆర్పిసి  తదితర కేసులను సమీక్ష చేశారు.   అరెస్టులు, చార్జ్ షీట్లు, సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నమోదైన కేసులలో సమగ్ర దర్యాప్తు నిర్వహించి నేరస్తులు తప్పించుకునే వీలు లేకుండా న్యాయ స్థానాలలో తగిన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయాలన్నారు.

 

 

 

పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను సిసిటి ఎన్ఎస్ లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని తెలిపారు.
అయా కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు సూచించారు. హత్య కేసుల, పోక్సో  కేసులు మరియు రేప్ కేసులలో దర్యాప్తు వేగాన్ని పెంచాలని, హత్య మరియు ఇతర కీలకమైన కేసుల్లో శాస్త్రీయ పద్ధతులలో దర్యాప్తు సమగ్రంగా చేపట్టాలని, మహిళల, చిన్నారుల అదృశ్యం కేసులలో ఏ విధమైన అలసత్వం చూపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, తప్పిపోయిన వారిని పట్టుకొనుటలో నిబద్ధత చూపించాలని సూచించారు.

 

 

Post Midle


ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని దొంగిలించిన సొత్తును రికవరీ చేయాలన్నారు. బీట్లు, పికెట్స్ ఏర్పాటు చేసుకొని అధికారులు తరుచుగా బీట్ చెక్ చేస్తూ సిబ్బందికి సూచనలు ఇవ్వాలన్నారు. దొంగతనాలు, దోపిడీలు, తదితర నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలకు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.దొంగతనాలను అరికట్టేందుకు హైవే రహదారులపై వాహనాల తనిఖీలు చేస్తూ  ప్రత్యేక చొరవ చూపాలని అలాగే లారీ అసోసియేషన్ వారితో మాట్లాడి కంటేనర్ భారీ వాహనాలకు సిసి కెమరాలు ఎర్పాటు చేసుకోవాలని వివరించి అవగాహన కల్పించాలని మరియు  అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని పాపిలాన్ పరికరం ద్వారా వారి వేలి ముద్రలను తనిఖీ చేయాలి.  రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వాహన తనిఖీలు చేపట్టి ఎం.వి.చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ, ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

 

 

 

లోన్ యాప్ ల మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా చైతన్యం చేయాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన  మట్కా, పేకాట, అక్రమ మద్యం రవాణాపై ముందస్తు సమాచారం సేకరించి వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి వంటి నిషేధిత మాదకద్రవ్యాలను రవాణా మరియు విక్రయించే వారిపై ఎన్డిపిఎస్ S కేసులు నమోదు చేయాలన్నారు.గంజాయి రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి ఎం.డి.పీ.ఎస్. కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించాలి. వీటిని అరికట్టడం వల్ల చిన్న పిల్లలను మరియు యువతను కాపాడుకోగలుగుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ రమణ, నంద్యాల టౌన్ డిఎస్పి మహేశ్వర్ రెడ్డి,  ఆళ్లగడ్డ డిఎస్పి సుధాకర్ రెడ్డి,  దిశ డిఎస్పి మారుతీరావు,  సిఐ లు ,ఎస్ఐ లు పాల్గొన్నారు.

 

Tags: Nandyala district SP who conducted the crime review meeting

Post Midle