Natyam ad

వివాహ వేడుకల్లో పాల్గోన్నకొడాలి నాని, వంగవీటి రాధా

గుడివాడ ముచ్చట్లు:


గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ,టిడిపి నాయకుడు వంగవీటి రాధా ఆత్మీయ కలయిక చర్చనీయంశమయింది. కె. కన్వెన్షన్ లో జరుగుతున్న వైసీపీ నాయకుడు కుమార్తె వివాహ వేడుకలో కొడాలి నాని, రాధ పాల్గోన్నారు. మిత్రుడి రాక కోసం గంట సేపు ఎదురుచూసిన కొడాలి నాని, రాధా రాగానే కారు దగ్గరకు వెళ్లి రిసీవ్ చేసుకున్నారు.
కొడాలి నాని ముందే రాధా తో సెల్ఫీలు దిగేందుకు యువత, రాధా రంగా మిత్రమండలి సభ్యులు ఎగబడ్డారు.  వైసీపీలో ఉన్న కొడాలి,టీడీపీలో ఉన్న రాధా కలయికపై మరోసారి రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది. అయితే, ఎప్పటినుంచో నాని,రాధా స్నేహితులు కావడంతో కలిసి పెళ్లికి హాజరయ్యారని అనుచరులు అంటున్నారు. ఈ కార్యక్రమానికి రాధా బాబు తో పాటుగా రాధా అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Nani and Vangaveeti Radha participated in the wedding ceremony

Post Midle
Post Midle