అర్థం కాని కోడాలి నాని లెక్క

విజయవాడ ముచ్చట్లు:

బీజేపీ నేత పురందేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో కొత్త కలకలానికి కారణం అవుతోంది. గుడివాడలో కేంద్ర నిధులతో నిర్మించాలనుకుంటున్న రెండు ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని పురందేశ్వరి అడ్డుకుంటున్నారని కొడాలి నాని ఆరోపణ. నిజానికి పురందేశ్వరికి గుడివాడ ఫ్లైఓవర్లకు ఎలాంటి సంబంధం లేదు. కనీసం ఆమె గుడివాడ నియోజకవర్గ వ్యవహారాల్లో కూడా వేలు పెట్టలేదు. అంతే కాదు.. కేంద్రంలో కూడా ఎలాంటి పదవిలో లేరు. కేవలం బీజేపీలో కీలక పదవిలో ఉన్నారు. అయితే గుడివాడలో కొంత మంది వ్యాపారుల కోసం ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పురందేశ్వరి అడ్డుకునేందుకు గడ్కరీ అపాయింట్‌మెంట్ తీసుకున్నారని కొడాలి నాని చెబుతున్నారు. పురందేశ్వరి తీసుకున్న అపాయింట్‌మెంట్.. అది ఫ్లైఓవర్ల గురించేనని కొడాలి నానికి ఎవరు చెప్పారో కానీ.. విమర్శలు మాత్రం వ్యూహాత్మకంగా రాజకీయంగా చేస్తున్నారన్న అభిప్రాయం మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో వంశీ, నాని వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. తాజాగా పురందేశ్వరిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కలకలం ప్రారంభమయింది. ఇటీవల పలువురు కేంద్రమంత్రులు ఏపీకి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కేంద్ర పథకాల నిధులకు..ఏపీ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యూహాత్మకంగా గుడివాడ నానిని వైసీపీ పెద్దలు రంగంలోకి దింపారని అంటున్నారు. ఇతర నేతలపై విమర్శలు చేస్తే పెద్దగా పట్టించుకోవడం లేదని.. నేరుగా పురందేశ్వరిని గురి పెట్టారని అంటున్నారు. తమపై విమర్శలు చేస్తే.. తమ రియాక్షన్ కూడా అలాగే ఉంటుందని చెప్పడానికి గుడివాడ నాని ద్వారా పురందేశ్వరిని టార్గెట్ చేయించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొడాలి నాని చెప్పే ఫ్లైఓవర్లను కేంద్రం మంజూరు చేసింది. ఇటీవల నితిన్ గడ్కరీ వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పుడు వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారని కొడాలి నాని అంటున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన భూమి.. నిధులు పెండింగ్‌లో ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.

 

Tags: Nani calculation that does not make sense

Leave A Reply

Your email address will not be published.