సదరన్ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాని

Nani is the minister who started the Southern camp

Nani is the minister who started the Southern camp

Date:03/12/2019

మచిలీపట్నం ముచ్చట్లు:

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సదరన్ సర్టిఫికెట్ ప్రక్రియను రాష్ట్ర మంత్రి పేర్ని నాని మంగళవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సౌకర్యార్దంగా, సులభతరంగా ఉండేందుకు వికలాంగులకు సథరన్ సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేసాం. సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి వద్దు. వారానికి రెండు రోజులు మంగళ వారం, శుక్రవారం,  కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా వారానికి ఒక రోజు నిర్వహించేందుకు ఏర్పాటుచేసామని అన్నారు. 35 రూపాయలు మించి మీ సేవలో నమోదుకు ఒక్క పైసా కూడా ఇవ్వకండి. దళారులను నమ్మొద్దు, దోచుకునేందుకు అవకాశం ఇవ్వకండి. లంచం అడిగినా ప్రభుత్వానికి పిర్యాదు చేయండని అయన సూచించారు. సర్టిఫికెట్లు ఇచ్చేదాంట్లో ఎవరి పాత్ర ఉండదు కేవలం ఒక్క డాక్టరుకు మాత్రమే విచక్షణాధికారం. నాకు కానీ, కలెక్టర్ కాని ఒక్క ఉత్తరం ముక్క రాయండి లేదా స్పందనలో పిర్యాదు నమోదు చేయించండని మంత్రి అన్నారు.

 

తిరుమల \|/ సమాచారం

 

Tags:Nani is the minister who started the Southern camp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *