కొల్లు రవీంద్ర పై మండిపడ్డ మాజీమంత్రి పేర్ని నాని

మచిలీపట్నం ముచ్చట్లు:


కొల్లు రవీంద్ర కు  దేవుడు ఒక శాపం యిచ్చాడు సిగ్గు లేకుండా మాట్లాడటం. బందరు అభివృద్ధిలో నువ్వు చేసింది ఏమిటో నేను చేసింది ఏమిటో శ్వేత పత్రం విడుదల చేద్దామా అని మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీ నేత కొల్లు రవీంద్రపై మండిపడ్డారు. సామాజిక సాధికారిక యాత్ర విజయంతం పై పట్టలేనంత కోపం ఈర్ష్య,ద్వేషం తో తన కడుపు మంట అంత అబద్ధాలు మాట్లాడుతూ తీర్చుకుంటున్నాడు. మదరాసు స్థలంపై ఒక సంస్థకు యిచ్చే స్థలం ఒక వ్యక్తి పేరు మీద అదికూడా మి పార్టీ కౌన్సిలర్ కుమారుడి పేరు మీద యిచ్చావు. పోర్ట్ విషయంలో కట్టని పోర్ట్ కి 8.70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావ్, కనీసం పైలాన్ కట్టిన స్థలం కూడా ఒక పేద రైతు వద్ద బలవంతంగా లక్కున్నారు. పేద ప్రజల స్థలాలు తీసుకొని 11 వేల ఏకరాలలో పోర్ట్ అని ఎలక్షన్ కోడ్ వచ్చే 10 రోజుల ముందు శంఖుస్థాపన చేశావ్. మెడికల్ కాలేజీ నా హాయం అంటున్నావు ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్, కనీసం ఒక్క జీఓ అయిన యిచ్చావా అయితే చూపించని అన్నారు.

 

 

ఈరోజు పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటే పేర్ని నాని,జగన్మోహన్ రెడ్డి చలువ కదా. ఎవరో బ్రతుకుదేరువు కోసం వచ్చిన ఒకడు రాసిన స్క్రిప్ట్ నీ చదువుతూ అబద్ధాలు చెప్పడం కాదు. యిప్పటి వరకు బస్సు యాత్ర బాగానే జరిగింది అని అనుకుంటున్నాము, కానీ నీ ఏడుపు చూసి బ్రహ్మాండంగా జరిగిందని అనుకుంటున్నాము. సిగ్గులేని రాజకీయాలు ఆపి నిజాయితీ రాజకీయాలు చేయండి. నేను నా కొడుకుని క్రొత్తగా ప్రమొట్ చేసుకోవడం ఏంటి గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు, ఈ నియోజకవర్గానికి పార్టీకి ఇంఛార్జి గా వున్నాడు కాబట్టి ఆయన అధ్వర్యంలో జరిగిందని అన్నారు.

 

Tags: Nani is the name of the ex-minister who got angry with Kollu Ravindra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *