ఎంపీలకు నాని స్ట్రాంగ్ ట్వీట్

Date:18/09/2020

విజయవాడ ముచ్చట్లు:

టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుకుండా.. సీబీఐ పేరుతో ధర్నాలు చేయడం ఏంటని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎందుకు పోరాటం చేయరని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్‌సీపీ ఎంపీలను కేశినేని నాని ప్రశ్నించారు. మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఎంపీల తీరుపై మండిపడ్డారు.‘రాష్ట్రానికి ప్రత్యేక హొదా కోసం ఎప్పుడు పోరాడతారు జగన్ననా.. అట్లాగే నీ మీద వున్న సీబీఐ కేసులు కూడా త్వరగా విచారణ పూర్తి అవ్వటానికి సహకరించవచ్చు కదా.. ఏ అంశం మీద అయినా సీబీఐ ఎంక్వైరీ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం ఆమోదం తెలపడం ఆనవాయితీ దానికి ధర్నాలు అవసరం లేదు. జగన్ గారూ రాష్ట్రానికి రావలసిన వాటి కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు పోరాడితే ప్రజలు హర్షిస్తారు. చెత్త రాజకీయాలు మాని రాష్ట్రానికి రావాల్సిన వాటి పైన పోరాటం చేయండి’అన్నారు.ఎంపీ రామ్మోహన్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రజలు 22 మందిని లోక్ సభకు పంపినా.. 6 రాజ్య సభ సభ్యులు ఉన్నా.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గళం విప్పింది లేదన్నారు. పోరాటం చేసింది లేదన్నారు. బలం తగ్గినా, సమయం తగ్గినా, తెలుగు దేశం తరఫున నేను రాష్ట్రం కోసం, ఉత్తరాంధ్ర నిధుల కోసం అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటాను అన్నారు.

 

పల్లవి చాలా కాస్ట్ లీ

 

Tags:Nani Strong tweet to MPs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *