పార్టీని ఇరకాటంలో పడిన నాని

Date:15/08/2020

విజయవాడ ముచ్చట్లు: 

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిది సపరేట్ రూట్. ఆయన తన వ్యక్తిగత ఇమేజ్ కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ట్రాన్స్ పోర్టు బిజినెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కేశినేని నాని విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా రెండు సార్లు విజయం సాధించారు. రెండుసార్లు ఆయనకు టీడీపీయే టిక్కెట్ ఇచ్చింది. అయితే కేశినేని నాని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడు సొంత పార్టీనే ఇరకాటంలో పెడుతుండటం చర్చనీయాంశమైంది.
విజయవాడ టీడీపీలో గ్రూపు రాజకీయాలకు కొదవ లేదు. కేశినేని నాని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పటి మంత్రి దేవినేని ఉమతో పొసిగేది కాదు. దేవినేని ఉమ తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని అధినేత చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారన్నది కేశినేని నాని భావన. అందుకే తొలినుంచి కేశినేని నాని దేవినేని ఉమను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అదే సమయంలో విజయవాడ నగర పార్టీ ఇన్ ఛార్జి బుద్దా వెంకన్నతో కూడా కేశినేని నానికి పడదు.
అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ కార్యాలయాన్ని కేశినేని భవన్ నుంచి తీసివేయడం కూడా నానికి ఆగ్రహం కల్గించింది. దీని వెనక దేవినేని ఉమ ఉన్నారన్నది కేశినేని నాని ఆరోపణ.

 

ఈ విషయంలో ట్విట్టర్ లో కేశినేని నాని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పంచాయతీలో స్వయంగా చంద్రబాబు కల్పించుకోవాల్సి వచ్చింది. పదవులు కూడా తనకు కాకుండా వేరే వారికి కట్టబెట్టడం నానిలో అసహనాన్ని పెంచింది. దీంతో చంద్రబాబు విజయవాడ నగర మేయర్ పదవిని ఆయన కూతూరు కు ఇస్తానని మాట ఇవ్వడంతో కొంత తగ్గారు.తాజాగా చంద్రబాబు అమరాతి పై చేస్తున్న పోరాటం పై కూడా కేశినేని నాని సెటైర్లు వేయడం చర్చనీయాంశమైంది. కలలు సాకారం చేసుకోవాలంటే ప్రత్యర్థులపై ఆధారపడకూడదని, మీడియా సమావేశాల ద్వారా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు చంద్రబాబు కన్నా దేవినేని ఉమను ఉద్దేశించి కేశినేని నాని చేశారన్నది సమాచారం. దేవినేని ఉమ నిత్యం ప్రెస్ మీట్ లు పెడుతున్నా ప్రజలు రిసీవ్ చేసుకోవడం లేదన్నది కేశినేని నాని భావనగా అన్పిస్తుంది. మొత్తం మీద చంద్రబాబుకు కేశినేని నాని కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థిితి. మరోవైపు కేశినేని నాని కూడా ట్విట్టర్ లోనే కన్పిస్తుండటాన్ని ఆయన వ్యతిరేకులు తప్పుపడుతున్నారు.

 

 

 విశాఖలో ముందే రాబందులు

Tags:Nani who challenged the party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *