శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న  నారా చంద్రబాబు నాయుడు

తిరుపతి ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు   నారా చంద్రబాబునాయుడు గురువారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయం ఎదుట టీటీడీ జేఈవో   వీరబ్రహ్మం   ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం   నారా చంద్రబాబునాయుడు దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి, వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో ముఖ్యమంత్రికి జేఈవో  వీరబ్రహ్మం అమ్మవారి ప్రసాదాలు, వస్త్రం అందచేశారు.అనంతరం శ్రీవారి, అమ్మవారి దర్శన ఏర్పాట్లు బాగున్నాయని ముఖ్యమంత్రి జేఈవో  వీరబ్రహ్మంకు కితాబు ఇచ్చారు.ఆలయ డిప్యూటీ ఈవో   గోవింద రాజన్ , ఆగమ సలహాదారు  శ్రీనివాసాచార్యులు, అర్చకులు   బాబు స్వామి పాల్గొన్నారు.

 

Tags: Nara Chandrababu Naidu visited Sri Padmavati Ammavari

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *