రెండో రోజు సిఐడి విచారణకు నారా లోకేష్
అమరావతి ముచ్చట్లు:
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రెండో రోజూ బుధవారం నాడు సీఐడీ విచారణకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు.
చెప్పిన సమాయానికి కంటే ముందుగానే లోకేష్, తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విచారణ కొనసాగింది. అయనతోపాటు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు మంగళవారం తొలిరోజు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోకేష్ను సీఐడీ అధికారులు విచారించారు.ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేకుండా ఎక్కువ ప్రశ్నలు హెరిటేజ్ గురించే సీఐడి ఆడిగిందని విచారణ తరువాత లోకేష్ తెలిపారు. మంగళవారం విచారణ ముగిశాక మళ్లీ 41 ఏ నోటీసు జారీ చేసి బుధవారం కూడా విచారణకురమ్మని సీఐడీ ఆదేశించిన విషయం తెలిసిందే.
Tags; Nara Lokesh to CID investigation on the second day

