నారా లోకేశ్ పై పోటీచేసి గెలుస్తా

Nara will compete in Lokesh and win

Nara will compete in Lokesh and win

Date:14/03/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
వైఎస్ జగన్ తనకు ఛాన్సిస్తే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ పై పోటీచేసి గెలుస్తానని అన్నారు హీరో ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు. ఇటీవలే వైసీపీలో చేరిన ఆయన్ని పార్టీ కేంద్ర పాలకమండలి(సీజీసీ) సభ్యుడిగా నియమించారు అధినేత వైఎస్ జగన్. అయితే ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్నది సస్పెన్స్గా మారింది. ఈ నేపథ్యంలోనే నార్నె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని టీడీపీ అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. మంగళగిరి టిక్కెట్ తనకు కేటాయిస్తే లోకేశ్పై తప్పకుండా గెలుస్తానని అన్నారు నార్నె శ్రీనివాసరావు.
చంద్రబాబుకు, జగన్ కు చాలా తేడా ఉందని, ప్రజల కోసం వైఎస్ ఎంతో చేశారు కాబట్టే తాను జగన్కు మద్దతిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ను చంద్రబాబు డెవలప్ చేయలేదని అన్నారు. తన నిర్ణయంతో ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని.. ఈ అంశాన్ని ఆయనతో ముడిపెట్టొద్దని కోరారు. నార్నె శ్రీనివాసరావు ఫిబ్రవరి 28న వైసీపీలో చేరారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ. పదేళ్లగా వైఎస్ కుటుంబంతో తాను సన్నిహితంగా ఉన్నానని చెప్పారు. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నానని.. అందుకే పార్టీలో చేరానని తెలిపారు.
Tags:Nara will compete in Lokesh and win

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *