Natyam ad

పుంగనూరులో నారాభువనేశ్వరి పర్యటన

పుంగనూరు ముచ్చట్లు:

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం సాయంత్రం పుంగనూరులో పర్యటించారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ సమయంలో మనోవేదనకు లోనై మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి , వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆమె తొలుత పెద్దపంజాణి మండలం కత్తార్లపల్లెలో శంకరప్ప కుటుంభాన్ని పరామర్శించారు. అక్కడి నుంచి నేరుగా ఎన్‌ఎస్‌.పేట, చెలిమిగడ్డ , చండ్రమాకులపల్లె ప్రాంతాలకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆమె వెంట నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, చల్లారామచంద్రారెడ్డి తదితరులు పర్యటించారు.

Post Midle

Tags: Narabhuvaneshwari tour in Punganur

Post Midle