పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌గా నరసింహాప్రసాద్‌

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు నూతన మున్సిపల్‌ కమిషనర్‌గా పి.నరసింహాప్రసాద్‌ను నియమిస్తూ మున్సిపల్‌ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఉత్తర్వులు అందాయి. కాగా తాడిపత్రి కమిషనర్‌గా పని చేస్తున్న నరసింహాప్రసాద్‌ను ఇక్కడికి బదిలీ చేశారు. ఇక్కడ కమిషనర్‌గా పని చేస్తున్న కెఎల్‌.వర్మ తిరుపతి మున్సిపల్‌ ఆర్‌వోగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మేనేజర్‌ రసూల్‌ఖాన్‌ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. నూతన కమిషనర్‌ ఈనెల 24న పదవి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.
 
Tags: Narasimha Prasad as Punganur Municipal Commissioner

Natyam ad