Narasimhareddy attached to the DGP's office.

డి.జి.పి కార్యాలయానికి నరసింహరెడ్డి అటాచ్.

Date:25/09/2020

మాదాపూర్ ముచ్చట్లు:

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి ఏసీబీకి చిక్కిన మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డిపై వేటు పడింది.అతడిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.నరసింహారెడ్డి స్థానంలో మల్కాజిగిరి ఏసీపీగా మాదాపూర్‌ ఏసీపీ శ్యాంప్రసాదరావును నియమించారు.ఇంటెలిజెన్స్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న రఘునందన్‌రావును మాదాపూర్‌ ఏసీపీగా నిమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఏసీబీ కేసులో ఇప్పటికే అరెస్టయిన నరసింహారెడ్డిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసే అవకాశముంది.దాదాపు 25 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తులను గుర్తించింది.ఆయన స్వగ్రామమైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పూల ఓబయ్యపల్లితో పాటు తెలంగాణలోని వరంగల్‌, యాదాద్రి భువనగిరి, జనగామ, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లోని బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లల్లో సోదాలు చేసింది.సుమారు రూ. 7.5 కోట్ల విలువైన అక్రమాస్తుల్ని అధికారులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 70 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం…

Tags: Narasimhareddy attached to the DGP’s office.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *