4న నరసింహాస్వామి కళ్యాణ మండపాలు నిర్వహణ వేలం

Date:02/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు సమీపంలోని గూడూరుపల్లెలో వెలసియుండు శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయ ప్రాంగణంలోని రెండు కళ్యాణ మండపాలు నిర్వహణ వేలం వేయనున్నట్లు కమిటి అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆలయం వద్ద ఉన్న రెండు కళ్యాణ మండపాలలో శుభకార్యాలయాలు నిర్వహించుకునేందుకు మూడు సంవత్సరాల గడువుతో నిర్వహ ణ వేలం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వేలం పాటలను 4న వేస్తామన్నారు. పాటలో పాల్గొనే వారు రూ.25 వేలు ధరావత్తు చెల్లించి, వేలంలో పాల్గొన్నాలన్నారు. వేలంపాటలు అదేరోజు ఖరారు చేస్తామని తెలిపారు. వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఘనంగా పింగళివెంకయ్య జయంతి వేడుకలు

Tags: Narasimhaswamy Kalyan Mandapas maintenance auction on 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *