జలసిరిలో పాల్గోన్న మంత్రులు నారాయణ, సోమిరెడ్డి

Date:15/09/2018
నెల్లూరు ముచ్చట్లు:
సోమశిల జలాశయం వద్ద జలసిరికి హారతి కార్యక్రమంలో మంత్రులు నారాయణ,  సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి, ఇన్చార్జ్ కలెక్టర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సాగునీటి రంగంపై గడచిన నాలుగేళ్లలో 58 వేల కోట్లను ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది.
నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే 58 శాతం పూర్తి చేయగలిగామని అన్నారు. పోలవరం నిర్మాణం పనులను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి అప్పగించిన విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు తెలుసుకోవాలి. అభివృద్ధిని అడ్డుకోవడం, అపనిందలు ప్రచారం చేయడం, అడ్డగోలుగా కేసులు వేయించడం తప్ప ప్రతిపక్షానికి రాష్ట్రంలో వేరే పని లేదు.
రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం గా పనిచేస్తోందని అన్నారు. నవ్యాంధ్ర లో కోటి అయిదు లక్షల ఎకరాలకు నీరందిస్తున్నాం, త్వరలో మరో 35 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తామని అన్నారు.
Tags: Narayan and Somireddy are ministers in the Jalasiri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *